వర్డ్‌ప్రెస్ స్థానికీకరణ: ఏమిటి, ఎందుకు, ఎలా?

స్థానికీకరణ అంటే?

స్థానికీకరణ అంటే కంప్యూటర్ అనువర్తనాలను స్థానిక భాషలలోనికి (స్థానిక వాడుక, వ్యవహారాలకు తగ్గట్టు) అనువదించడం. స్థానికీకరించిన అనువర్తనం పూర్తిగా స్థానిక భాషలో ఉంటుంది. ఉదాహరణకు తెలుగు వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డు:

తెలుగు వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్టు తెరపట్టు
తెలుగు వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్టు తెరపట్టు
చదవడం కొనసాగించండి

#how-to, #l10n

హైదరాబాదులో 4వ వర్డ్‌ప్రెస్ స్థానికీకరణ దినోత్సవం: 11 మే 2019

ఏమిటి: ప్రపంచవ్యాప్తంగా జరిగే WP Translation Day 4 సందర్భంగా హైదరాబాదులో వర్డ్‌ప్రెస్ స్థానికీకరణ జట్టు సమావేశం
ఎప్పుడు: 11 మే, 2019
ఏం తీసుకురావాలి: మీతో పాటూ ఒక లాప్‌టాప్, లేదా మీ స్మార్ట్‌ఫోన్
ఏం చేస్తాము: స్థానికీకరణ పురోగతిపై సమీక్ష, భవిష్యత్ ప్రణాళిక, స్థానికీకరణ పోటీ, వగైరా. (స్థానికీకరణ: ఏమిటి, ఎందుకు,  ఎలా?)

సమయం: 🕓 11 మే, 2019, శనివారం, సాయంత్రం 4 గం॥ – 6 గం॥

ఎక్కడ: 📍 కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ చాప్టర్ కార్యాలయం, అర్చనా ఆర్కేడ్, సికింద్రాబాద్ – 500025. (సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ పక్కన)

సమయం: 🕙 11 మే, 2019, శనివారం, ఉదయం 10 గం॥ – మధ్యాహ్నం 1 గం॥

ఎక్కడ: 📍 స్వేచ్ఛ కార్యాలయం, గచ్చిబౌలి, హైదరాబాద్.

ఆనంద స్థానికీకరణం!

#wptranslationday

వర్డ్‌ప్రెస్ 4.7 తెలుగు అనువాదానికై పిలుపు

డిసెంబరు మొదటి వారంలో విడుదలయ్యే 4.7 సంచిక కోసం, సాఫ్ట్ స్ట్రింగ్ ఫ్రీజ్ అమలులో ఉంది. ఈ సమయంలో ‘గురించి’ పేజీ తప్ప ఇతరత్రా వాక్యాలు, పదాలు మార్చరు. (రేపటి నుండి హార్డ్ స్ట్రింగ్ ఫ్రీజ్, అంటే అసలు పదబంధాలు ఏమీ మారవు.) కనుక అనువదించడానికి ఇది మంచి సమయం.

ఏమేం అనువదించాలి?

చూడండి: పాలీగ్లాట్స్‌లో టపా

Welcome to Your Team’s O2!

We’re happy to give each locale team their own blog, allowing you to coordinate easier, right on WordPress.org. You can customize this site and add pages, as needed. If you have questions, let the meta team know.

How to use O2

O2 is a combination of a theme and a plugin that allows for easier collaboration. Here are a few features that will be helpful for coordinating your team’s activities:

  1. @mentions: Mention anyone on the WordPress.org network by putting an @ in front of their username. Members of your locale sites (including your main site, your forums, and O2) are automatically added to autocomplete.
  2. Tags: Tagging can be added easily right inside of posts and comments. For example, #welcome tags this post with “welcome.” Click on a tag and to see all tagged posts.
  3. Cross posts: Cross post to another O2 site on WordPress.org by using the + symbol. You can cross post to any site that’s using O2.

That’s it! Enjoy your new blog and file meta tickets if you run into any issues.